అంగరంగ వైభవంగా భావనోళ్ల పెళ్లి సందడి
– నూతన వధూవరులకు ఆశీర్వాదాల వెల్లువ
– శుభాకాంక్షలు తెలిపిన నేతలు, బందువులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరుకు చెందిన ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి, శ్రీ సాయి పుత్ర హోమ్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ కుటుంబంలో పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. శంకర్ యాదవ్ కుటుంబంలో బావనోళ్ల పద్మావతి, బావనోళ్ల పద్మావతి దంపతుల ద్వితీయ పుత్రుడు గోపాల్ యాదవ్ వివాహాము అనూషతో తాండూరు పట్టణం కోకట్ రోడ్డు మార్గంలోని వెంకోబా గార్డెన్‌లో జరిగింది. ఈ వివాహా వేడుకలో భావనోళ్ల శంకర్ యాదవ్, చంద్రకళ దంపతులతో పాటు కుటుంబ సభ్యులు బావనోళ్ల నీలమ్మ, హన్మయ్య, బావనోళ్ల సుజాత, కృష్ణయ్య, ఆత్మీయ బందువుల సమక్షంలో నూతన వధూవరులు వేదమంత్రాల సాక్షిగా ఒక్కటయ్యారు. ఈ వివాహ వేడుకకు బావనోళ్ల కుటుంబ సభ్యులు, బందువులు, మిత్రులు, శ్రేయోభిలాషులు తరలిచ్చి నూతన వధూ వరులను ఆశీర్వదించారు. అదేవిధంగా మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, బీసీ సంఘం జాతీయ కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్, అంతారం ఎంపిటీసీ శాంతు, పలువురు రాజకీయ ప్రముఖులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు, వ్యాపారులు తరలివచ్చి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఇది కూడా చదవండి…
తాండూరుకు పీఆర్ ఈఈ, క్వాలిటీ కంట్రోల్ కార్యాలయాలు
– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
– ఫలించిన సునీతామహేందర్ రెడ్డి ప్రయత్నం
https://dharshininews.com/17321


