మైమరిపించిన మధుర జ్ఞాపకాలు

తాండూరు రాజకీయం వికారాబాద్

మైమరిపించిన మధుర జ్ఞాపకాలు
– ఉత్సహాంగా పూర్వ విద్యార్థుల సమ్మేళం
– 32 ఏండ్ల తరువాత కలుసుకున్న విద్యార్థులు
– టీచర్లు, స్కూళ్లకు సాయంపై తీర్మానం
తాండూరు, దర్శిని ప్రతినిధి: 32 ఏండ్ల మధుర జ్ఞాపకాలలో పూర్వ విద్యార్థులు మైమరిచిపోయారు. ఈ అపూర్వ సంఘటన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో చోటు చేసుకుంది. యాలాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1990-91 సంవత్సరంలో పదవ తరగతి విద్యాభ్యాసం చేసి పూర్వపు విద్యార్థులందరూ కలిసి ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. ఆదివారం అనంతగిరి రిస్టార్ట్ లో ఈ కార్యక్రమాన్ని జరుపుకున్నారు. 32 సంవత్సరాల తరువాత కలుసుకున్న పూర్వ విద్యార్థులు అప్పటి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమం, పాఠశాలకు సాయం అందించే కార్యక్రమం పై చర్చించుకున్నారు. ఈ అపూర్వ కలయిక ఎంతో సంతోషం వచ్చిందని సంతోషపడ్డారు. కార్యక్రమంలో తాండూర్ మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఆశన్న, ప్రతినిధులు నాగ సంబంధర్ బిచ్చప్ప, సంతోష్ కుమార్, బిజ్వర్ షేక్ హుస్సేన్, విజయలక్ష్మి, గౌరీ, సునంద, వేణు, కండక్టర్లు రమేష్, రమేష్ శ్రీనివాస్ గౌడ్, శివకుమార్, జనార్దన్ గౌడ్, చంద్రశేఖర్, రమ్య నాయక్, సాయిలు తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి…
సూపర్ పోలీస్..!
– నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న దొంగ
– చాకచక్యంగా పట్టుకున్న తాండూరు పోలీసులు
– డీఎస్పీ చేతుల మీదుగా రివార్డులు
https://dharshininews.com/17404
chaithany collage