కేసుల సత్వర పరిష్కారానికే లోక్‌ అదాలత్‌

క్రైం తాండూరు వికారాబాద్

కేసుల సత్వర పరిష్కారానికే లోక్‌ అదాలత్‌
– 10న కోర్టుల్లో మెగా లోక్‌ అదాలత్‌
– వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: పరిష్కరింపబడే వివిధ కేసుల్లో ఉన్న వారు వాటిని రాజీ చేసుకోవడమే రాజమార్గం అని, కేసుల సత్వర పరిష్కారానికి నిర్వహించే మెగా లోక్‌ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని వికారాబాద్‌ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పేర్కోన్నారు. సోమవారం ఎస్పీ ఓ ప్రకటనలో మాట్లాడుతూ వచ్చే నెల 10వ తేదిన జిల్లాలోని కోర్టులలో న్యాయ శాఖ ఆధ్వర్యంలో మెగా లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్ లలో యాక్సిడెంట్ కేసులు, కొట్టు కున్న కేసులు, చీటింగ్ కేసులు, చిట్పండ్ కేసులు, వివాహ బందానికి సంబంధించిన కేసులు, చిన్న చిన్న దొంగతనం కేసులు, అక్రమ రవాణా( ఇసుక, మట్టి, కట్టెలు, మరియు మద్యం తదితర), పేకాట మరియు లాక్ డౌన్ కేసులు తదితర కేసులు ఉన్నట్లయితే అలాంటి కేసులను లోక్‌ అదాలత్‌లలో పరిష్కరించుకోవచ్చని అన్నారు. కేసుల రాజీకొరకు తమ స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని సూచించారు. రాజీ మార్గమే రాజ మార్గంగా ఏర్పాటు చేస్తున్న లోక్‌ అదాలత్‌లను కేసులు నమోదైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి…
రేషన్‌కు హెల్ప్‌ లైన్..!
– మీ కోటా ఇవ్వకుంటే కంప్లైట్ చేయొచ్చు
– తూకంలో మోసాలపై ఫిర్యాదుకు అవకాశం
https://dharshininews.com/17434
chaithany collage