పీఎంఆర్ క్రికెట్ టోర్నమెంట్ సూపర్‌ హిట్

క్రీడలు తాండూరు రాజకీయం వికారాబాద్

పీఎంఆర్ క్రికెట్ టోర్నమెంట్ సూపర్‌ హిట్
– క్రీడాకారుల్లో జోష్‌ నింపిన పట్నం రినీష్‌ రెడ్డి
– గౌతాపూర్‌ లో టోర్నమెంట్‌ ప్రారంభం
– తరలివచ్చిన బీఆర్ఎస్ నేతలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, వికారాబాద్‌ జెడ్పీ చైర్ పర్సన్ సునితా మహేందర్ రెడ్డిల తనయుడు పట్నం రినీష్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పిఎంఆర్ క్రికెట్ టోర్నమెంట్ సూపర్ హిట్‌ అయ్యింది. తాండూరు నియోజకవర్గంలో మండలాల వారిగా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్‌కు క్రీడాకారుల నుంచి స్పందన లభించింది. గురువారం తాండూరు మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్‌ను మండలంలోని గౌతాపూర్ గ్రామంలో ఏర్పాటు చేశారు.

బీఆర్ఎస్ సీనీయర్ నాయకులు రాంచెంద్రారెడ్డి(రాజు), తాండూరు మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు మేఘానాథ్‌ గౌడ్‌ల సమక్షంలో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్‌కు రినీష్ రెడ్డి హాజరై డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, బీఆర్ఎస్ తాండూరు పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్ తదితరులతో కలిసి టోర్నమెంట్ ను ప్రారంభించారు. క్రీడాకారులతో కరచాలనం చేసుకుని బ్యాటింగ్ చేసి ఉత్తేజ పరిచారు. ఈ సందర్భంగా రినీష్ రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత యువత చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని అన్నారు. మండల స్థాయిలో నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ లో క్రీడాకారులు ప్రతిభను నిరూపించుకోవాలన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములను సహజంగా తీసుకోవాలన్నారు. చివరగా ఆట ఆడడం తెలుసు.. ఆడించడం తెలుసు అంటూ పంచ్‌ డైలాగ్ ఇచ్చిపడేశారు.

అదేవిధంగా డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి వారసుడుగా రినీష్ రెడ్డి ప్రజాభిమానాన్ని పొందుతున్నారని అన్నారు. యువతకు చేరువయ్యేలా క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. గతంలోనే తాండూరు ప్రాంత యువతకులకు ఉద్యోగవకాశాలు కల్పించి అండగా నిలిచారని గుర్తుచేశారు. మరోవైపు నిర్వహకులు రాంచంద్రారెడ్డి, మేఘనాథ్ గౌడ్ లు మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు 30 జట్ల పేర్లు నమోదయ్యాయని తెలిపారు. పోటీలో గెలుపొందిన విజేత జట్టుకు రూ.50 వేలు, ద్వితీయ జట్టుకు రూ. 25 వేల బహుమతి అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చెంగోల్ మాజీ ఎంపీటీసీ గౌడి వెంకటేశం, మసూద్ సర్పంచులు లాల్ రెడ్డి, విజయ్ పటేల్, మాజీ సర్పంచ్ ఇస్మాయిల్, మల్కాపూర్ గని కార్మిక, సంఘం మాజీ వైస్ చైర్మన్ పండరి, యువ నాయకులు బిర్కడ్ రఘు, రొంపల్లి సంతోష్‌ కుమార్, తాండ్ర రాకేష్, శ్రీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…
మహిళా సంఘాలకు గుడ్‌ న్యూస్‌
– రూ.15,037 కోట్ల రుణాలకు సర్కారు ఆమోదం
– గత యేడాది కంటే రూ.2315 కోట్లు అధికం
https://dharshininews.com/17490

chaithany collage