విద్యార్థుల చదువుకు తోడ్పాటు
– ఆర్బీఓఎల్ ఎండీ సరళా శ్రీనివాస్ రెడ్డి
– కరణ్‌కోట్‌లో నోటు పుస్తకాల పంపిణీ
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : పేద విద్యార్థులు చదువుకు తోడ్పాటు అందిస్తామని తాండూరు కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి సతీమణి, ఆర్బీఓఎల్ ఎండీ సరళా రెడ్డి అన్నారు. మంగళవారం కర్ణాటక రాష్ట్రం యాద్దీర్ ప్రాంతానికి చెందిన శ్రీ మల్లికార్జున అప్పాజీ స్వామి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి సరళా శ్రీనివాస్ రెడ్డి హాజరై విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తరగతి గదిలో ఉన్న విద్యార్థుల్లోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు. అందుకే పేద విద్యార్థుల చదువుకు తమవంతు తోడ్పాటు అందిస్తామన్నారు. విద్యార్థుల అభివృద్ధికి నిరంతరం సహాయ సహాకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ శరణు బసప్ప, సీనియర్ జర్నలిస్టు శెట్టి రవిశంకర్, ఎంపీటీసీ రాజ్ కుమార్, ఉపాధ్యాయులు నర్సిరెడ్డి, కిష్టప్ప, నాయకులు పటేల్ కిరణ్ కుమార్, బంటు వేణుగో పాల్, తాండ్ర రాకేష్, విష్ణు, పలువురు ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

