శభాష్ డాక్టర్ కరిష్మా..!
– అరుగంటల్లో పది సాధారణ ప్రసాలు చేయడం గొప్ప విషయం*
– ఫోన్ చేసి అభినందించిన జెడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని జిల్లా ఆసుపత్రి, మాతా శిశు ఆసుపత్రిలో వైద్యులు అందించే గొప్ప సేవలను వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ సునితారెడ్డి అభినందించడంతో ముందుంటారు. తాజాగా మాతా శిశు ఆసుపత్రిలో ఆరు గంటల్లో పది సాధారణ ప్రసవాలు చేయడంపై జెడ్పీ చైర్ పర్సన్ అభినందించారు. పది మంది గర్భిణీలకు సాధారణ ప్రసవాలు చేసిన తాండూరు మాతశిశు ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ కరిష్మాపై ప్రశంసల జల్లు కురిపించారు. జెడ్పీ చైర్ పర్సన్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ హోదాలో పట్నం సునీతా మహేందర్ రెడ్డి ఫోన్ చేసి అభినందించారు. వైద్యుల సమిష్టికృషితో మాతశిశు ఆసుపత్రి సాధారణ ప్రసవాలు చేయడంలో ఉత్తమ సేవలు అందిస్తున్నారని కొనియాడారు. సాధారణ ప్రసవాలతో మహిళలు సంపూర్ణ ఆరోగ్యాంగా, శరీరకంగా బలంగా ఉంటారని అన్నారు. ప్రతీ గర్భిణీ మహిళా ప్రభుత్వ ఆస్పత్రిలోనే ప్రసవాలు చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఇది కూడా చదవండి…


