తెలంగాణ రన్‌ను జయప్రదం చేయండి
– రేపు తాండూరులో కార్యక్రమం
– తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రేపు తాండూరులో తెలంగాణ రన్‌ను కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తాండూరు ఆర్డీఓ అశోక్ కుమార్ తెలిపారు. ఆదివారం ఓ ప్రకటనలో మాట్లాడుతూ సోమవారం పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వెల్లడించారు. అక్కడి నుంచి పట్టణంలోని విలియమూన్ స్కూల్ వరకు తెలంగాణ రన్‌ను కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలతో పాటు ప్రజా ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, యువకులు, విద్యార్థులు, అధికారులు, అందరు పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇదికూడా చదవండి…


