ఉత్సహాంగా తెలంగాణ రన్..!
– జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– పాల్గొన్న అధికారులు, నేతలు, యువకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరులో తెలంగాణ రన్ ఉత్సహాంగా కొనసాగింది. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తాండూరు రెవెన్యూ, పోలీసు శాఖ, మున్సిపల్ శాఖలతో పాటు ఇతర శాఖలు, సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రన్ చేపట్టారు. సోమవారం ఉదయం తాండూరు పట్టణ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరై జెండా ఊపి తెలంగాణ రన్‌ను ప్రారంభించారు.

అనంతరం అక్కడి నుంచి శాంత్ మహాల్ చౌరస్తా, ఇందిరా చౌరస్తా మీదుగా విలియం మున్ గ్రౌండ్ వరకు తెలంగాణ రన్ కార్యక్రమం కొనసాగింది. ఈ రన్‌లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పాల్గొని అధికారులను, నేతలను, యువకులను ఉత్తేజ పరిచారు. రన్ తరువాత ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ప్రభుత్వం సాధించిన విజయాలను, పథకాల గురించి మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్, ఆర్డీవో అశోక్ కుమార్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, పట్టణ ప్రధాన కార్యదర్శులు సంతోష్ గౌడ్, శ్రీనివాస్, తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి, రూరల్ సీఐ రాంబాబు, ఎస్ఐలు, మున్సిపల్ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ మండల ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, పలు విభాగాల నాయకులు, ఆర్పీలు, యువజన విభాగం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


