శివస్వాములకు తోడ్పాటు అందిస్తాం

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

శివస్వాములకు తోడ్పాటు అందిస్తాం
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : శివస్వాములకు తమవంతు తోడ్పాటు అందిస్తామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తన నివాసంలో పట్టణంలోని కోటేశ్వర దేవాలయం కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం ఎమ్మెల్సీ కోటా నుంచి మంజూరైన రూ. 3 లక్షల నిధులకు సంబంధించిన ప్రోసీడింగ్స్ ను శివస్వాముల సంఘానికి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ పాత తాండూరులోని కోటేశ్వర దేవాలయంలో శివస్వాములు కమ్యూనిటీ హాల్ గురించి కోరడం జరిగిందని గుర్తుచేశారు. ఇచ్చిన హామీ మేరకు ఎమ్మెల్సీ కోటా నుంచి రూ. 3 లక్షల నిధుల ప్రొసిడింగ్స్ ను అందజేయడం జరిగిందన్నారు. శివస్వాములకు తమవంతు తోడ్పాటు అందించేందుకు ముందుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మొగులయ్య గౌడ్, భీమ్, రవి, నర్సింలు, ఉప్పరి నర్సింలు, నర్సింలు, నరేష్, ప్రసాద్, కోట్ల రాజ్ కుమార్ రెడ్డి, యువకులు తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి…

తాత తడబడలేదు..!

chaithany collage