ఇంటర్‌ అడ్మిషన్లకు గడువు పెంపు

కెరీర్ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

ఇంటర్‌ అడ్మిషన్లకు గడువు పెంపు
– ప్రకటించిన ఇంటర్‌ బోర్డు
– ఎప్పటి వరకు చాన్స్‌ ఉందంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో చేరే విద్యార్థులకు ఇంటర్ బోర్డు గుడ్‌ న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జూనియర్‌ కాలేజీల్లో 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలు జులై 25 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటిచింది. ఈ మేరకు ఇంటర్‌ బోర్డు కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో తెలిపారు. అయితే ఇంటర్‌ ప్రవేశాల గడువు జూన్‌ 30వ తేదీతో ముగుస్తుందని గతంలో నోటీఫికేషన్ ఇచ్చింది. ఐతే ప్రవేశాల ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడంతో ఈ మేరకు గడువును పొడుగిస్తున్నట్లు ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది. ఇప్పటి వరకు ప్రవేశాలు పొందని వారు గడువు తేదీలోగా కాలేజీలో చేరాలని సూచించింది. కాలేజీల జాబితానే బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వివరించింది. పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు కూడా ప్రవేశాలు పొందవచ్చని సూచించింది.

ఇది కూడా చదవండి…

తాత తడబడలేదు..!

chaithany collage