తాండూరు ఆర్టీసీకి అవార్డులు
– సంస్థ చైర్మన్, ఎండీల చేతుల మీదుగా ప్రధానం
– హర్షం వ్యక్తం చేసిన డీఎం సమత
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఆర్టీసీ డిపోకు అవార్డులు వరించాయి. ఆర్టీసీ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ చేతుల మీదుగా అవార్డులను అందుకున్నారు. మంగళవారం హైదరాబాద్ లోని కళాభవన్ లో రాష్ట్ర స్థాయి అవార్డుల ప్రధానోత్సవం నిర్వహించారు. దసరా స్పెషల్ చాలెంట్ అవార్డు, సంక్రాంతి స్పెషల్ చాలెంజ్ అవార్డులను ప్రధానం చేశారు. ఇందులో రంగారెడ్డి రీజియన్ రెండో స్థానంలో నిలిచింది. దసరా స్పెషల్ చాలెంజ్ లో తాండూరు డిపోకు చెందిన కండక్టర్ వెంకటయ్య, డ్రైవర్ ఎండి హసన్ లకు ఆవార్డులు దక్కాయి. సంక్రాంతి స్పెషల్ చాలెంజ్ లో కండక్టర్ ఎండి గులాం మహమ్మద్, డ్రైవర్ అంజిలప్పలకు ఆవార్డులు వరించాయి. దీంతో పాటు డిపో మేనేజర్ సమతకు కూడా ఉత్తమ అవార్డు దక్కింది. ఈ మేరకు సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ చేతుల మీదుగా వారు అవార్డులను అందుకున్నారు. రంగారెడ్డి రీజియన్ పరిధిలోని తాండూరు డిపోకు అవార్డులు రావడం పట్ల డీవో మేనేజర్ సమత హర్షం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి…


