విద్యతో ఉన్నత భవిష్యత్తు

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

విద్యతో ఉన్నత భవిష్యత్తు
– పేద విద్యార్థుల అభ్యున్నతికి తోడ్పాటు
– వీరశైవ ప్రతిభ విద్యార్థులకు సన్మానం
– అభినందించిన వీరశైవ సమాజం సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజంలో అందరికీ విద్యతోనే ఉన్నతమైన గుర్తింపు లభిస్తుందని తాండూర్ వీరశైవ సమాజం సభ్యులు పేర్కొన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని
భద్రేశ్వర దేవస్థానంలో ఇంటర్, టెన్త్ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ఉత్తమ వీరశైవ విద్యార్థులకు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సమాజంకు చెందిన రితీష్, అను శ్రీ పటేల్, మిరియానం శ్రేయ, అర్థి నందిని, మఠం గురుప్రియ, సిరిగిరి పెట్ స్నేహ, బీదర్ గాయత్రి, కోటం మనోజ్ఞ పటేల్ తరుణ్, బంటారం సహస్ర, దూది శ్రావణి, పటేల్ రమ్యశ్రీ లను సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు సమాజ పెద్దలు మాట్లాడుతూ చదువుతోనే ఉన్నతమైన భవిష్యత్తు ఉంటుందన్నారు. సమాజం కీర్తిని పెంచేలా ఇంటర్, టెన్త్ లో విద్యార్థులు సత్తా చాటడం అభినందనీయమని అన్నారు. అదేవిదంగా విద్యార్థుల ఉన్నత భవిష్యత్తు కోసం సమాజం ఎల్లప్పుడు సహాయ సహకారాలు అందజేస్తామని అన్నారు. విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో సమాజం గౌరవ అధ్యక్షులు తంబాకు చంద్రశేఖర్, అధ్యక్షులు పటేల్ శ్రీశైలం, ఉపాధ్యక్షులు జి పరమేశ్వర స్వామి, కార్యదర్శి గాజుల శాంతు కుమార్, సహాయ కార్యదర్శి పటేల్ విజయ్ కుమార్, కోశాధికారి కందనల్లి ప్రకాశం, కార్యవర్గ సభ్యులు ఘనపూర్ శంకర్, దూది నాగభూషణం, బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు శెట్టి భాస్కర్, సభ్యులు పాల్గొన్నారు.