కాంగ్రెస్‌ది కడుపు మంటే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

కాంగ్రెస్‌ది కడుపు మంటే..!
– రైతుల జోలికొస్తే గుణపాఠం తప్పదు
– హెచ్చరించిన బీఆర్ఎస్ నాయకులు
– తాండూరులో రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కృషి చేస్తుంటే కాంగ్రెస్ కడుపు మంటతో విమర్శలు చేస్తోందని తాండూరు బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఉచిత విద్యుత్ పై విమర్శలు చేసిన టీపీసీసీ రేవంత్ రెడ్డి రైతులకు, తెలంగాణ ప్రభుత్వానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బుధవారం బీఆర్ఎస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం) ఆధ్వర్యంలో పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, కౌన్సిలర్లు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు.

అనంతరం వారితో పాటు పలువురు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రైతులు సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధికి 24 గంటల విద్యుత్ అందిస్తుంటే టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి విమర్శలు చేయడంపై మండిపడ్డారు. వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ చాలని తెలంగాణ ప్రభుత్వాన్ని, రైతులను అవమానించిట్లుగా ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమానికి ఓర్వలేక కాంగ్రెస్ కడుపు మంటతో విమర్శలు చేస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వానికి, రైతులకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పి తీరాలని అన్నారు. లేదంటే రైతులే తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు విజయాదేవి, మంకాల రాఘవేందర్, సీనీయర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శులు ఎం. శ్రీనివాస్, సంతోష్ గౌడ్, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!

chaithany collage