వాగులు, చెరువుల వద్దకు వెళ్లొద్దు..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

వాగులు, చెరువుల వద్దకు వెళ్లొద్దు..!
– భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
– తాండూరు రూరల్ సీఐ రాంబాబు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : భారీ వర్షాలతో ఉప్పొంగుతున్న వాగులు, చెరువులు, వంకల వద్దకు వెళ్లే ప్రయత్నం ఎవ్వరు చేయోద్దని తాండూరు రూరల్ సీఐ రాంబాబు సూచించారు. ఆదివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ సంగెంకలాన్ లో వాగుదాటే ప్రయత్నం చేసి గల్లంతైన పెంటప్ప మృతి సంఘటన దురదృష్టకరమన్నారు. ప్రస్తుతం భారీ వర్షాలు కురిసే నేపథ్యంలో మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కూలీ పోయే ప్రమాదంలో ఉన్న ఇండ్లలో నివసించే ప్రజలు సురక్షిత నివాసాలకు తరలివెళ్లాలని అన్నారు. గ్రామాల సమీపంలోని చెరువులు, వాగుల వద్ద వెళ్లరాదని, పిల్లలు, యువకులు వెళ్లకుండా దృష్టిసారించాలన్నారు. ప్రవహిస్తున్న వాగులను దాటే సాహసాలను చేయొద్దన్నారు. అదేవిధంగా విద్యుత్ స్థంబాల వద్దకు వెళ్లరాదని, ఇంట్లో ఎలక్ట్రిక్ వస్తువుల నుంచి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూడాలన్నారు. వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఉంటే పోలీసులకు సంప్రదించాలన్నారు. అత్యవసరమైన పరిస్థితులు ఏర్పడితే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!

chaithany collage