ఆర్టీసీ బిల్లును ఆమోదం తెలపాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

ఆర్టీసీ బిల్లును ఆమోదం తెలపాలి
– తాండూరులో ఉద్యోగులు, కార్మికుల నిరసన
– నల్ల బ్యాడ్జిలు ధరించి గేటు వద్ద ఆందోళన
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆర్టీసీ బిల్లుపై ఆమోదం తెలపాలని తాండూరు ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు డిమాండ్ చేశారు. శనివారం తాండూరు ఆర్టీసీ డీపోలోని గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీకి చెందిన ఉద్యోగులు, డ్రైవర్లు, కండక్టర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక ఆర్టీసీ విలీన బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ అనుమతివ్వకపోవడం అన్యాయమని అన్నారు. కార్మికుల చిరకాల కోరికను తీరుస్తూ సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకోవడం తగదన్నారు. రాజకీయ కక్ష్యతో బిల్లుకు మోకాలడ్డు వేయొద్దన్నారు. బిల్లు ఆగిపోతే కార్మికులకు అన్యాయం ఆవేధన వ్యక్తం చేశారు. వెంటనే అసెంబ్లీలో ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలిపేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ యూనియన్ నాయకులు, ఉద్యోగులు, డ్రైవర్లు, కండక్టర్లు, కార్మికులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!