రేపు మహిళలకు సన్మానం

తాండూరు రాజకీయం వికారాబాద్


రేపు మహిళలకు సన్మానం
– తాండూరు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాట్లు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రేపు తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని మహిళ మణులకు సన్మానం చేస్తున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా ఈ సన్మానోత్సవం ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సోమవారం ఉదయం 11 గంటలకు పట్టణంలోని ఎస్వీఆర్ గార్డెన్ లో కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి నేతలు, అధికారులు, కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదికూడా చదవండి…

తుల్జాపూర్ భవాని మాత సేవలో విఠల్ నాయక్