చీరపై గోల్డ్ స్ర్పే..!

క్రైం టెక్నాలజీ తెలంగాణ రంగారెడ్డి హైదరాబాద్

చీరపై గోల్డ్ స్ర్పే..!
– గుట్టుగా స్మగ్లింగ్
– అయినా పట్టుకున్న అధికారులు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: ప్రస్తుతం సామాన్య, మధ్య తరగతి ప్రజలు పసిడి వైపు చూడాలంటే కూడా భయపడిపోయేలా బంగారం ధర భగ్గుమంటోంది. ఇతర దేశాలు,ప్రాంతాల నుంచి అక్రమంగా బంగారాన్ని తరలిస్తూ పుత్తడిని మరింత ప్రియంగా మార్చేస్తున్నారు. ఎయిర్‌పోర్టులు, సరిహద్దుల్లో ఎంత పటిష్ట నిఘా ఏర్పాటు చేసినా కూడా అక్రమార్కులు ఆగడం లేదు.. రోజు రోజుకు బంగారం అక్రమ రవాణా పెరిగిపోతోంది. తాజాగా శుక్రవారం రోజున శంషాబాద్ విమానాశ్రయంలో బంగారు చీర పట్టుబడింది. హైదరాబాద్‌లోని ఆర్‌జిఐ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ఓ ప్రయాణికుడిని పట్టుకుని అతని వద్ద నుండి 471 గ్రాముల గోల్డ్‌ శారీని స్వాధీనం చేసుకున్నారు.

దుబాయ్ నుంచి వచ్చిన ఓ ప్రయాణికుడు తన లగేజీలో బంగారాన్ని దాచి బట్టలపై స్ప్రే చేసి దేశంలోకి అక్రమంగా తరలించేందుకు ప్రయత్నించాడు. బంగారాన్ని లిక్విడ్ గా మార్చి ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా.. చీరపై స్ప్రే గా కొట్టి, స్మగ్లింగ్ చేసిన కేటుగాడి తెలివితేటలకు అధికారులు సైతం ఆశ్చర్యపోతున్నారు. దీని విలువల రూ.28.1 లక్షల ఉంటుందని అధికారులు వెల్లడించారు. అదుపులోకి తీసుకున్న నిందితుడిపై తదుపరి విచారణ కొనసాగుతోందని తెలిపారు. వీడియో ట్విటర్‌ లింకులో ఉంది చూండండి..

ఇది కూడా చదవండి...

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!