ఎస్ఐ కొలువు కొట్టిన గిరిపుత్రిక

కెరీర్ తాండూరు వికారాబాద్

ఎస్ఐ కొలువు కొట్టిన గిరిపుత్రిక
– కానిస్టేబుల్‌గా పనిచేస్తూనే పోస్టు
– ఎస్ఐ ఫలితాల్లో మెరిసిన మంజుల రాథోడ్‌
తాండూరు, దర్శిని ప్రతినిధి: పట్టుదలతో ఎస్ఐ కొలువు సాధించి.. ఆదర్శంగా నిలిచింది బషీరాబాద్‌ మండలం జీవన్గీ గ్రామానికి చెందిన గిరిపుత్రిక మంజుల రాథోడ్‌. కానిస్టేబుల్‌గా పనిచేస్తూనే ఎస్ఐ కావాలన్నా తన కలను సాకారం చేసుకుంది. వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం జీవన్గీ గ్రామానికి చెందిన సోనిబాయి, లక్ష్మణ్‌ రాథోడ్ల కూతురు మంజుల రాథోడ్ హైదరాబాద్‌లో ఎంబీఏను పూర్తి చేసింది. 2018లో నిర్వహించిన పోలీసు సెలక్షన్‌లో మొదటిసారిగా కానిస్టేబుల్‌గా ఎంపికైంది. శంషాబాద్ పోలీస్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోంది. కాగా తెలంగాణ రాష్ట్ర పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు నిర్వహించిన ఎస్ఐ ఉద్యోగానికి అర్హత సాధించి పరీక్షకు హాజరయ్యింది. ఆదివారం ప్రభుత్వం విడులు చేసిన ఫలితాల్లో మంజుల రాథోడ్‌ ఎస్ఐగా ఎంపికయ్యారు. వికారాబాద్‌ జిల్లా నుంచి మొత్తం 12 మంది ఎస్ఐ కొలువులను సాధించారు. కానిస్టేబుల్‌గా పనిచేస్తూనే ఎస్ఐ కావాలనే తన కలను, తల్లిదండ్రుల కలను నిజం చేసింది. గ్రామానికి చెందిన మంజుల ఎస్ఐ కొలువు సాధించి ఆదర్శంగా నిలవడం పట్ల పలువురు ఆమెకు శభాష్‌ అంటూ అభినందనలు తెలిపారు.

ఇది కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!