పెంపుడు జంతువులకు మెరుగైన వైద్యం అందించాలి
– మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: పెంపుడు జంతువులకు మెరుగైన వైద్యం అందించాలని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణం కోడంగల్ రోడ్డు సమీపంలోని గ్రీన్‌సిటీ కాలనీలో ఏర్పాటు చేసిన బీఆర్ పెట్ క్లీనిక్‌ను మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా పెంపుడు జంతువుల కోసం తాండూరులో క్లీనిక్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనారోగ్యానికి గురైతే చెప్పుకోలేని పెంపుడు జంతువులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. జంతువులకు సేవ చేయడం మహద్భాగ్యం అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనీయర్ నాయకులు డాక్టర్ సంపత్‌కుమార్, వార్డు కౌన్సిలర్ వరాల శ్రీనివాస్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్, బీజేపీ యువ నాయకులు రజనీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


