వారి సైగలే.. జీవిత పాఠం.. నేర్పుతున్నాయ్..!

ఆరోగ్యం కెరీర్ జాతీయం తెలంగాణ లైఫ్-స్టైల్ హైదరాబాద్

వారి సైగలే.. జీవిత పాఠం.. నేర్పుతున్నాయ్..!
– మూగ, చెవిటి దంపతల పానీ పూరీ దందా
– అడిగింది ఇచ్చే సేవలకు అందరు ఫిదా
– సోషల్‌ మీడియాలో వీడియో వైరల్
దర్శిని డెస్క్: ప్రపంచంలో చాలా మంది వివిధ సమస్యలతో సతమతం అవుతుంటారు. అనారోగ్య సమస్యలతోనో.. లోపాలతోనో.. చిన్న కారణాలతోనే ఆయువు తీసుకుంటుంటారు. కాని నేటి యువతకు మూగ, చెవుడు ఉన్న ఓ దంపతులు స్పూర్తిదాయకమైన జీవిత పాఠాన్నే నేర్పుతున్నారు. ఆ జంట ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పదండి వారి కథేంటో మనమూ తెలుసుకుందాం. చెవుడు, మూగ సమస్యలు ఉన్నా.. జీవితాన్ని జయించాలని నిర్ణయించుకున్నారు ఈ దంపతులు. మహారాష్ట్రలోని జంట నాసిక్‌లోని అడ్గావ్ నాకాలో హోటల్ దగ్గర తమ జీవనోపాధిగా చిన్న పానీ పూరీ స్టాల్‌ను నడుపుతున్నారు. మూడు, చెవుడు లోపాలు ఉన్నా ఆ సవాళ్లను చాలా దృఢ సంకల్పంతో ఎదుర్కొంటూ.. సదా చిరునవ్వు ముఖంతో వాటిని అధిగమిస్తున్నారు. దంపతులు ఇద్దరూ వారి పానీపూరీ స్టాల్‌ను నడిపించే విధానం వీడియోలో చూడవచ్చు. స్టాల్ వద్దకు వచ్చే వారికి సైగలను చేస్తూ ఆహారపదార్ధాల గురించి వివరించడం ఆకట్టుకుంది. తమ బండి దగ్గరకు వచ్చే కస్టమర్స్ బృందానికి ఏమి కావాలన్నా సైగలతోనే అడుగుతారు. ఈ వీడియోలో మహిళ సంజ్ఞలను ఉపయోగించి మసాలా ఎక్కువ అయిందా.. సరిపోయిందా అంటూ కస్టమర్‌ని అడగడం చూడవచ్చు. ఆమె కరకరలాడే పూరీలకు రుచిగల పుదీనా వాటర్ ను జోడించి..ఆ నోరూరించే ప్లేట్‌ను కెమెరాకు చూపుతుంది. చెవిటి , మూగ తమకున్న లోపాలను అధిగమించి వినియోగదారులకు అవసరమైన సేవలను అందిస్తున్నారు. ఈ జంట నుంచి నేటి తరం వారు అనుసరించాల్సిన, నేర్చుకోవలసింది ఎంతో ఉందంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్ ఫుడ్ వ్లాగర్ ‘స్ట్రీట్ ఫుడ్ రెసిపీస్’ పోస్ట్ చేసిన చేసిన ఈ జంట వీడియో సోషల్ మీడియాలో 3.7 మిలియన్లకు పైగా వీక్షణలను సొంతం చేసుకుంది. నేటి తరానికి నిజమైన స్ఫూర్తిగా మీరు నిలిచారంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. “ప్రతి ఒక్కరూ వీరి స్టాల్ ను సందర్శించి వారి మనోధైర్యాన్నిచూసి మరింత నేర్చుకోవాలంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

https://www.instagram.com/reel/ChzaXJJDGnO/?utm_source=ig_web_copy_link