రేషన్‌ డీలర్లకు గుడ్‌ న్యూస్..!

తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

రేషన్‌ డీలర్లకు గుడ్‌ న్యూస్..!
– క్వింటాల్ కమీషన్ ధరల పంపు
– ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ డీలర్లకు సర్కారు గుడ్‌ న్యూస్ చెప్పింది. రేషన్ డీలర్ల కమీషన్ ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్ తదితరులు రేషన్ డీలర్ల సంఘాల జేఏసీ ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఈ సమావేశంలో రేషన్‌ డీలర్ల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. రేషన్ డీలర్లకు అందిస్తున్న క్వీంటాల్ కు 70 నుంచి 140 రూపాయలకి పెంచుతున్నట్లు తెలిపింది. అయితే గత కొన్నాళ్లుగా రేషన్ డీలర్లకు భద్రత కావాలని.. ప్రభుత్వం ఇచ్చే కమీషన్ స్థానంలో వయస్సుతో సంబంధం లేకుండా గౌరవ వేతనం ఇవ్వాలని రేషన్ డీలర్లు పోరాటం చేశారు. 21 డిమాండ్లతో ప్రభుత్వానికి పలుమార్లు వారు వినతి పత్రాలు సమర్పించారు.

ప్రజాపంపిణీ వ్యవస్థలో రేషన్ డీలర్ల పాత్ర కీలకమని.. రైస్ మిల్లర్లకు అన్ని విధాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని.. రేషన్ డీలర్లను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. జూన్ 5 తరువాత సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. అయితే అప్పుడు ప్రభుత్వం చర్చలు జరిపింది.. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామి హామీ ఇవ్వడంతో వారు వెనుదిగారు. ఇక, తాజాగా రేషన్ డీలర్ల సంఘాలతో భేటీలో బీమా, వేబ్రిడ్జిల ఏర్పాటు, డీలర్ రెన్యూవల్ ఐదేళ్లకు పెంపు, రేషన్ భవన్, అంత్యక్రియల సాయం తదితర 13 ప్రధాన అంశాలకు ప్రభుత్వం పరిష్కారం చూపించింది. రేషన్ డీలర్లకు అందిస్తున్న క్వీంటాల్ కు 70 నుంచి 140 రూపాయలకి పెంచుతున్నట్లు తెలిపింది. అంటే మెట్రిక్ టన్నుకు అందిస్తున్న రూ.200లుగా ఉన్న కమీషన్‌ రూ.1400కు పెరగనుంది. దీంతో పాటు రేషన్ డీలర్లకు హెల్త్ కార్డులు ఇవ్వడంతో పాటు కరోనాతో చనిపోయిన డీలర్ల స్థానంలో వారి కుటుంబ సభ్యులకు డీలర్ షిప్ ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ అంగీకరించింది. కమీషన్‌ను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రేషన్‌ డీలర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి…

పాన్‌తో ఆధార్‌ లింకు చేయకుంటే అంతే..!