పేదల సంక్షేమమే ధ్యేయం
– కుల వృత్తులు, మైనార్టీలకు సాయం ఘనత సీఎం కేసీఆర్‌దే
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– బీసీ బందు, మైనార్టీ లోన్, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని జేఎంఎస్ గార్డెన్లో తాండూరులోని 300 మంది బీసీలకు బీసీ బంధు, 50 మంది మైనార్టీలకు రుణ సాయం, 85 మంది సీఎంఆర్ఎస్ చెక్కుల పంపిణీ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై తన చేతుల మీదుగా లబ్దిదారులకు చెక్కులను ఆంధజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వాలు చేయని అభివృద్ధిని సీఎం కేసీఆర్ సుసాధ్యం చేస్తున్నారని అన్నారు.
బీసీ కులవృత్తి దారులకు, మైనార్టీలకు రూ. 1 లక్ష సాయం అందిస్తున్న ఘతన కేసీఆర్ కే దక్కిందన్నారు. అనారోగ్యంతో బాధపడే పేదల ఆరోగ్యాలకు భరోసా అందించేలా సీఎంఆర్ఎఫ్ పథకంతో పేదలను ఆదుకుంటున్నారని అన్నారు. బీసీ బంధు, మైనార్టీలకు రుణసాయంతో పాటు దళితులకు బంధు అంటూ అన్నివర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని అన్నారు. ఈ పథకాల అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందన్నారు. దీనిపై ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాలను నమ్మరాదన్నారు. అదేవిధంగా పేదల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో నేతలు, అధికారులు ఎవరైనా చేతివాటం ప్రదర్శిస్తే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), మున్సిపల్ వైస్ చైర్ పర్సస్ పట్లోళ్ల దీపా నర్సింలు, బీఆర్ఎస్. రాష్ట్ర నాయకులు పంజుగుల శ్రీశైల్ రెడ్డి, పెద్దేముల్ ఎంపీపీ అనునాధ, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

