మాదాసి కురువ సర్టిఫికెట్లు ఇప్పించండి

తాండూరు రాజకీయం వికారాబాద్

మాదాసి కురువ సర్టిఫికెట్లు ఇప్పించండి
– జిల్లా కలెక్టర్ కు సంఘం నాయకుల విజ్ఞప్తి
తాండూరు, దర్శిని ప్రతినిధి : కురుమలకు మాదాసి కురువ లేదా మాదారి కురువ కుల సర్టిఫికెట్లు ఇప్పించేలా చూడాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ను సంఘం నాయకులు కోరారు. సోమవారం తాండూరు కురువ కుల సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. కురువ కులం సభ్యులకు మాదాసీ కురువ లేదా మాదారి కురువ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి పోయి సీరీయల్ నెంబర్ ప్రకారం బీసీ బీ కింద కురుబ/కురుమ అని ఇస్తున్నారని కలెక్టర్ కు వివరించారు. దీంతో కురువలు అనాధిగా నష్టపోతున్నారని అన్నారు. రాజ్యాంగం ప్రకారం సీరియల్ నెంబర్ 30 కింద మాదాసి కురువ లేదా మాదారి కురువ కుల సర్టిఫికెట్లు ఇప్పించేలా చూడాలని వినతిపత్రంలో కోరారు. ఇందుకు కలెక్టర్ ప్రతీక్ జైన్ సానుకూలంగా స్పందించి చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిపారని సంఘం నాయకులు తెలిపారు.

లేదంటే ఆందోళన చేస్తామని కలెక్టర్ కు చెప్పడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు డివిజన్ మాదాసి కురువ సంఘం ఉపాధ్యక్షులు పూజారి పాండు, ఒగ్గు జానపద డోలు కళాకారుల రాష్ట్ర ఉపాధ్యక్షులు నాగులపల్లి నర్సింలు, గొట్లపల్లి పూజారి మల్లప్ప, కొత్లాపూర్ మాజీ సర్పంచ్ సాయిలు, యాలాల మండల అధ్యక్షులు మహిపాల్, పెద్దేముల్ మండల అధ్యక్షులు ధనరాజ్, చెంగోల్ రాము, బిజ్జారం కిష్టప్ప, హనుమయ్య, డి.శ్రీశైలం, ఇందూరు బాలు, మిట్టి మహేష్, పడగాల సంపత్ కుమార్. గోపాల్ పూర్ గోపాల్, అయినెల్లి దస్తప్ప, నాగసముందర్ బాలు, మారేపల్లి పెంటప్ప తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి..

అతిథి గృహంపై పట్టింపు ఏది..!