బీఆర్ఎస్‌తోనే సంక్షేమ పాలన
– మళ్లీ గెలిచేది మనమే.. వచ్చేది మనమే
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– మల్కాపూర్‌లో బీఆర్‌ఎస్‌లో భారీగా చేరికలు
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్‌తోనే సంక్షేమ పాలన జరుగుతోందని, మళ్లీ గెలిచేది మనమే అని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు మండలం మల్కాపూర్ లో భారీగా చేరికలు జరిగాయి. తాండూరు మండల బీసీ సెల్ అధ్యక్షులు ఆర్సీ గౌడ్, మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు షేక్ హసన్ పటేల్, కోఆప్షన్ సభ్యులు ఎండి శంషోద్దీన్ ల ఆధ్వర్యంలో సుమారు 250 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదల సంక్షేమానికి పెద్దపీట వేశారన్నారు. కులవృత్తులకు ప్రాధాన్యతనిస్తూ దళితబందు, బీసీ బంధు, మైనార్టీలకు సాయం, రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అదేవిధంగా గత పాలకులు తాండూరు అభివృద్ధిని విస్మరించారని, సవతి ప్రేమ వల్ల వెనుకబాటుకు గురైందన్నారు. తాండూరు బిడ్డగా నమ్మి గెలిపించడం పట్ల తాండూరు అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందన్నారు. తాండూరును మరింత అంచెలంచెలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ కు తిరుగులేదని, గెలిచేది మనమే అని అన్నారు.
అంతకుముందు తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మల్కాపూర్ గ్రామ యువకులు గ్రామ గేటు నుంచి బైకు ర్యాలీ నిర్వహించి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాందాస్, నాయకులు పటేల్ ఉమాశంకర్, విజయ్, శేఖర్, సర్పంచులు సంఘం అధ్యక్షులు రాములు, ఎంపీటీసీ ఫోరం జిల్లా అధ్యక్షులు సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

