కార్మికులకు వివక్ష చూపించొద్దు

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

కార్మికులకు వివక్ష చూపించొద్దు
– సమ్మెకు మద్దతు తెలిపిన డాక్టర్ నరేష్
– కార్మికులతో బైటాయించి నినాదాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంటే మున్సిపల్ కార్మికులపై వివక్ష చూపించరాదని తాండూరుకు చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ నరేష్ అన్నారు. గత ఐదు రోజులుగా తాండూరు పాత మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులు చేపడుతున్న సమ్మెకు డాక్టర్ నరేష్ మద్దతు ఇచ్చారు. సమ్మెలో బైటాయించిన కార్మికులకు పూల దండ వేసి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు ప్రభుత్వం పెంచిన వేతనాలను చెల్లించాలని కోరడం న్యాయమైనదే అని అన్నారు. ఎన్నో కోట్లు ఉన్న వారు పట్టణాన్ని ఆపరిశుభ్రం చేస్తే.. పట్టణాన్ని పరిశుభ్రంగా మార్చే కార్మికుల పట్ల అధికారులు, పాలకులు వివక్ష చూపించడం తగదని అభిప్రాయపడ్డారు. కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వాన్ని, అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసి తాండూరు మున్సిపల్ ఎంప్లాయిస్. వర్కర్స్ యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.