బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్
– తాండూరులో పాపన్నగౌడ్‌కు నివాళులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : బహుజన వర్గాల కోసం పోరాడిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. శుక్రవారం సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని పురస్కరించుకుని బీపీ సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని వినాయక్ చౌరస్తా వద్ద ఆయన విగ్రహనికి నివాళులు అర్పించారు. కందుకూరి రాజ్ కుమార్‌తో పాటు సంఘం నేతలు విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ తొలి బహుజన పోరాట యోధుడు సర్వాయి పాపన్న గౌడ్ అని అభివర్ణించారు. కులవృత్తులను ఏకం చేసిన మహోన్నతుడని అన్నారు. శివాజీ మహరాజ్ లాగా మొగులాయిలను, పెత్తం దారులను ఎదురించి బహుజనుల హక్కుల కోసం ఉద్యమించిన సర్వాయి పాపన్న గౌడ్ ఆదర్శనీయుడని అన్నారు. ఆయన ఆశయ సాధనకు అందరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, పట్టణ మహిళ అధ్యక్షురాలు నాయికోడి జ్యోతి, బీఆర్ఎస్ నాయకులు సంతోష్ గౌడ్, రాజన్ గౌడ్, బీసీ సంఘం బషీరాబాద్ అధ్యక్షులు నరేందర్, తాండూరు మండల అధ్యక్షులు బసంత్, గౌడ సంఘం నాయకులు బాబాగౌడ్, రాజేష్ గౌడ్, రాఘవేందర్ గౌడ్, నాయకులు బస్వరాజ్, జగన్, విజయలక్ష్మీ, సాయి, రాజు, మతీస్, నగేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

