ఉత్సహాంగా సైక్లోథాన్ 3.0..!
– తాండూరులో ఆకట్టుకున్న సైకిల్ ర్యాలీ
– మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో క్రీడా దినోత్సవం
– ర్యాలీ ప్రారంభించిన డీఎస్పీ శేఖర్ గౌడ్
– ప్రశంసపత్రాలు అందజేసిన చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో సైక్లోథాన్ 3.0 కార్యక్రమం ఉత్సహాంగా కొనసాగింది. ఆదివారం నేషనల్ స్పోర్ట్స్ డేను పురస్కరించుకుని ఆల్ ఇండియా మార్వాడి యువమంచ్ పిలుపు మేరకు తాండూరు మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో సైక్లోథాన్ యాత్ర చేపట్టారు. పట్టణంలోని గంగోత్రి స్కూల్ నుంచి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి తాండూరు డీఎస్పీ జీ. శేఖర్ గౌడ్ హాజరై సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. ఉదయం 7 గంటల నుంచి గంగోత్రి స్కూల్ నుంచి విలియంమూన్ చౌరస్తా, ఇందిరా చౌరస్తా, శాంత్ మహాల్ చౌరస్తా, డీఎస్పీ కార్యాలయం, మార్ప బజార్ నుంచి గగ్రాని ఫంక్షన్ హాల్ వరకు కొనసాగింది. ఈ ర్యాలీలో దాదాపు 200 మంది విద్యార్థులు, సైకిలిస్ట్ సభ్యులు, మంచ్ సభ్యులు యాత్రలో పాల్గొన్నారు. పురవీధుల గుండా ర్యాలీలో సైకిలింగ్‌పై ప్రజలను చైనత్య పరిచేలాల నినాదాలు చేస్తూ ముందుకు సాగారు.
అనంతరం గగ్రానీ ఫంక్షన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో డీఎస్పీ శేఖర్ గౌడ్, చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ లు ర్యాలీలో పాల్గొన్న వారికి ప్రశంస పత్రాలను అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ సైకలింగ్ చేయడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయన్నారు. ప్రతిరోజు 10 కిలో మీటర్లు సైకిలింగ్ చేస్తే ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్వాడి యువమంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్మోహన్ సార్డా, తాండూరు అధ్యక్షులు బ్రిజ్ మోహన్ బూబ్, కార్యదర్శి కిషన్ రాఠి, కోశాధికారి అరుణ్ సార్డా, ప్రోగ్రామ్ చైర్మన్ భరత్ దేవ్‌డా, మాజీ అధ్యక్షులు రమేష్ చంద్రబూబ్, సూపర్య ప్రకాష్ సోమాని, కుంజ్ బిహారీ సోనీ, సన్ని అగ్రవాల్, పవన్ సోని, దినేష్ పర్తానీ, అనిల్ సార్డా, లక్ష్మీనారాయణ బూబ్, ఆశిష్ సార్డా, గంగోత్రి స్కూల్ టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి….

