బీఆర్ఎస్ కన్నా కాంగ్రెస్సే బెట్టర్..!
– తెలంగాణలో అధికారంలోకి వచ్చే చాన్స్
– అభివృద్ధిని విస్మరించిన కేసీఆర్ సర్కారు
– కర్ణాటక వైద్య శాఖ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్
– తాండూరు బాలాజీలో మెగా వైద్య శిబిరానికి హాజరు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పాలనపై కర్ణాటక రాష్ట్ర వైద్య, విద్యాశాఖ మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ విమర్శలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ కన్నా కర్ణాటకలో కాంగ్రెస్ పాలన బెట్టర్గా ఉందని వ్యాఖ్యానించారు. మంగళవారం తాండూరు పట్టణం శ్రీ బాలాజీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరంకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ మాట్లాడారు. కర్ణాటక రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన 5 గ్యారెంటీ పథకాలను అమలు చేయడం జరుగుతుందన్నారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన భేషుగ్గా ఉందన్నారు. రాష్ట్రంలోని 31 జిల్లాలో 32 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 35 కు పైగా ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఉన్నాయన్నారు. దీంతో పాటు ట్రామాకేర్, మాతా శిశు ఆసుపత్రిలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. తెలంగాణ కంటే కర్ణాటకలో రోడ్లు అభివృద్ధిలో ఉన్నాయని చెప్పుకొచ్చారు.
కర్ణాటక హైదరాబాద్ ప్రాంతాల్లోని రహదారులను రూ.5 వేల కోట్లతో.. అభివృద్ధి పరుస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ – కర్ణాటక సరిహద్దు ప్రాంతల్లో బ్రిడ్జీల నిర్మాణం చేపట్టడం జరిగిందని, హల్కోడా- బషీరాబాద్ మార్గంలో కాగ్నా నదిపై బ్రిడ్జి నిర్మాణం చేశామని గుర్తుచేశారు. జెట్టూరు వద్ద నదిపై తామే బ్రిడ్జి నిర్మాణం చేశామన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రోచ్ రోడ్డులను వేసుకోలేకపోయిందని వి’ మర్శించారు. నియోజకవర్గ సరిహద్దు మైల్వార్, నీళ్లపల్లి అటవీ ప్రాంతాల్లో భూముల పరిష్కారానికి దృష్టి సారించలేదన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ అభివృద్ధి కంటే కర్ణాటకలో కాంగ్రెస్ అభివృద్ధి బెటర్ గా ఉందని అభివర్ణించారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. పార్టీ ఆదేశిస్తే ఎన్నికల ప్రచారానికి వస్తానని అన్నారు. అనంతరం మెగా వైద్య శిబిరానికి హాజరైన మంత్రి శరణు ప్రకాష్ పాటిల్ ఆసుపత్రి అధినేత డాక్టర్ సంపత్ కుమార్, మున్సిపల్ మాజీ చైడ్ పర్సన్ సునితాసంపత్, కుటుంభ సభ్యులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బస్వరాజ్, కాంగ్రెస్ నాయకులు కోర్వార్ నాగేష్ తదితరులు ఉన్నారు.
ఇది కూడ చదవండి…

