సాగునీటి ఇబ్బందులకు ‘చెక్’
– తాండూరుకు ఐదు చెక్ డ్యాంలు
– రూ. 43.45 కోట్లు మంజూరు
– జీఓ 297ను జారీ చేసిన ప్రభుత్వం
– ఫలించిన ఫైలెట్ రోహిత్ రెడ్డి కృషి
తాండూరు, దర్శినిప్రతినిధి: తాండూరు నియోజకవర్గంలో ఇక సాగునీటి ఇబ్బందులకు చెక్ పడబోతోంది. స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కృషితో నియోజకవర్గానికి కొత్తగా ఐదు చెక్ డ్యాంలు మంజూరయ్యాయి. ఈమేరకు శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీఓ 297ను జారీ చేయడమే కాకుండా రూ. 43.45 కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. దీంతో తాండూరు నియోజకవర్గంలో చెక్ డ్యాంల సంఖ్య 11కు చేరింది. గతంలో మొదటి విడతలో తాండూరు నియోజకవర్గంకు 6 చెక్ డ్యాంలు మంజూరు చేసింది. రూ.36.88 కోట్లతో తాండూరు మండలం ఎల్మకన్నె, చిట్టిఘనాపూర్, బషీరాబాద్ మండలం క్యాద్గిర, యాలాల మండలం గోవిందరావుపేట్, సంగెంఖర్దు, పెద్దేముల్ మండలం మన్ సాన్ పల్లి వద్ద చేపట్టిన చెక్ డ్యాంల నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి అయ్యాయి. తాజాగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కొత్తగా చెక్ డ్యాంల నిర్మాణం కొరకు చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రెండో విడతలో రూ. 43.45 కోట్లతో తాండూరు మీదుగా ప్రవహించే కాగ్నా నదిలో కొత్తగా పెద్దేముల్ మండలం మన్ సాన్ పల్లి, తాండూరు మండలం ఖాంజాపూర్, చంద్రవంచ, యాలాల మండలం దేవనూర్(నాగసముందర్), రసూల్ పూర్(బెన్నూర్)ల వద్ద వీటిని నిర్మించనున్నారు.
తాండూరులో చెక్ డ్యాంల నిర్మాణ కోసం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కృషి చేశారు. రెండో విడత కింద ఆయన కృషి ఫలితంగా చెక్ డ్యాంలు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ చెక్ డ్యాంల నిర్మాణం పూర్తి అయితే కాగ్నా పరివాహక ప్రాంతాలలో భూగర్భ జలాలు పెరగడంతో పాటు సాగునీటికి ఇబ్బంది ఉండబోదని అన్నారు. ప్రతిపాదించిన ఐదు చెక్ డ్యాంలను మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి…

