మంత్రి, ఎమ్మెల్యే ప్రోగ్రాంలో ప్రోటోకాల్ చిచ్చు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

మంత్రి, ఎమ్మెల్యే ప్రోగ్రాంలో ప్రోటోకాల్ చిచ్చు..!
– కార్యాలయాల ప్రారంభోత్సవంలో అసంతృప్తి జ్వాల
– మండిపడిన ఎంపీపీ, జెడ్పీటీసీ, డీసీసీబీ డైరెక్టర్
– వికారాబాద్‌ జిల్లా తాండూరులో ఘటన
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లా తాండూరులో జరిగిన రాష్ట్ర మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు నిర్వహించిన ప్రోగ్రాంలో ప్రోటోకాల్ చిచ్చు రేగింది. కార్యాలయాల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ పాటించకపోవడంపై తాండూరు ఎంపీపీ అనితా రవీందర్ గౌడ్, జెడ్పీటీసీ గౌడి మంజుల వెంకటేశం, వైస్ ఎంపీపీ స్వరూప, డీసీసీబీ ఉమ్మడి జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్ లు ఆసంతృప్తి వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళితే.. ఆదివారం తాండూరు పరిషత్ కార్యాలయంలో పంచాయతీ రాజ్ ఈఈ, క్యూసీ కార్యాలయాల ప్రారంభోత్సవం ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్ర గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో కలిసి కార్యాలయాలను ప్రారంభించారు. అయితే కార్యాలయాల ప్రారంభోత్సవంలో ప్రోటోకాల్ పాటించలేదని ఎంపీపీ అనితా గౌడ్, జెడ్పీటీసీ గౌడ్ మంజుల, డీసీసీబీసీ జిల్లా డైరెక్టర్ రవీందర్ గౌడ్ లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కార్యాలయాల ప్రారంభోత్సవం కోసం ఏర్పాటు చేసిన బోర్డులో ఎంపీపీ అనితా గౌడ్, జెడ్పీటీసీ గౌడి మంజుల, వైస్ ఎంపీపీ స్వరూప పేర్లు రాయలేని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పరిధిలో ఉన్న కార్యాలయాల ప్రారంభోత్సవంలో సమాచారం అందించకపోవడంతో అంతర్యమేంటని ప్రశ్నించారు.

నిబంధనలు ఉల్లంఘనపై అధికారులు సమాధానం చెప్పాలన్నారు. లేదంటే కార్యాలయాల తొలగింపుకోసం ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు తీర్మానం చేస్తామన్నారు. అదేవిధంగా అధికారులపై చర్యలు తీసుకునేవిధంగా జిల్లా కలెక్టర్ కు, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని అన్నారు.

ఇది కూడా చదవండి..

పేద విద్యార్థుల సేవలో..!