మనిషికి పంది కిడ్ని..!

ఆరోగ్యం జాతీయం టెక్నాలజీ తెలంగాణ హైదరాబాద్

మనిషికి పంది కిడ్ని..!
– అమెరికా వైద్యుల ప్రయోగం
– కిడ్ని ఎన్నిరోజలు పనిచేసిందంటే..?
దర్శిని డెస్క్‌: వైద్య రంగంలో చేసే ప్రయోగాలు ముందుగా జంతువులపై చేయడం సాధారణం. జంతువులపై చేసిన ప్రయోగాలను మనుషులపై అమలు చేస్తుంటారు. ఇలా జంతువులకు మనుషులకు సంబంధాలు ఉన్నాయి. భవిష్యత్తులో జంతువుల అవయాలు మనషులకు కూడా అమర్చే రోజులు కూడా రావచ్చు. ఇందుకు తగ్గట్లు అమెరికా వైద్యులు చేసిన ప్రయోగం భరోసా కల్పిస్తోంది. అదేంటంటే అమెరికాకు చెందిన మారిస్ మిల్లర్‌ అనే 57 ఏండ్ల వ్యక్తి కేన్సర్‌ బారిన పడి బ్రెయిన్ డెడ్ అయ్యారు. ఆయన కిడ్ని కూడా పనిచేయడం మానేంది. ఈ క్రమంలో అమెరికాలోని ఎన్‌వైయూ లాంగోన్ హెల్త్ సంస్థకు చెందిన డాక్టర్‌ రాబర్ట మాంట్‌గోమెరీ వైద్య బృందం ఓ ప్రయోగం చేసింది. పందికి చెందిన కిడ్నిని మనిషికి అమర్చి పనితీరుపై ప్రయోగం చేశారు. మనిషికి జంతు అవయవాల మార్పిడిలో వైద్యులు కీలక విజయం సాధించారు. మనిషికి అమర్చిన పంది కిడ్నీ ఏకంగా రెండు నెలలు పనిచేసింది. ఇదివరకు కూడా మనిషికి పంది కిడ్నీని అమర్చినా ఒకటి రెండు రోజులకు మించి పనిలేయలేదు. జన్యుమార్పిడి చేసిన పంది కిడ్నీతో చేసిన తాజా ప్రయోగంలో రెండు నెలలు పనిచేసింది. ఈ ప్రయోగం జరిగే సమయంలోనే మారిస్ మిల్లర్‌ కన్నుమూశారు.

ఇది కూడా చదవండి..

పేద విద్యార్థుల సేవలో..!