గణేష్‌ లడ్డూ.. సమ్‌థింగ్‌ స్పెషల్‌..!

తాండూరు రాజకీయం వికారాబాద్

గణేష్‌ లడ్డూ.. సమ్‌థింగ్‌ స్పెషల్‌..!
– 21 కిలో డ్రైఫూట్స్‌తో తయారు
– తాండూరులో ఇదే మొదటిసారి 
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రతి యేడాది అందరు భక్తిశ్రద్దలతో వినాయక చవితి జరుపుకుంటారు. ఏ యేడాదికి ఆ యేడాదికి ప్రత్యేకంగా ఉత్సవాలను జరుపుకోవడానికి ఉత్సవ నిర్వహకులు ఉత్సహాం చూపిస్తుంటారు. వికారాబాద్‌ జిల్లాలో కూడా ఈ సారి వినాయక ఉత్సవాలను విభిన్నంగా జరుపుకుంటున్నారు. వివిధ రూపాల్లో వినాయకులను ప్రతిష్టించడమే కాకుండా దేవుని ముందు పూజించే లడ్డూ తయారులో కూడా విభిన్నతను ప్రదర్శిస్తున్నారు. వినాయక లడ్డూ సమ్‌థింగ్ స్పెషల్‌ ఉండేలా అభిరుచిని చాటుకుంటున్నారు. తాండూరు పట్టణం విజ్ఞానపురి కాలనీలో 21 కిలోల డ్రైఫూట్స్‌తో వినాయక లడ్డూను తయారు చేశారు. వినాయకుని ముందు ఉంచి ప్రతిరోజూ పూజలు నిర్వహిస్తున్నారు. 21కిలోల డ్రైఫూట్స్‌ తో లడ్డూను తయారుచేయడం ఇదే మొదటిసారి. ఈ విషయం తెలిసిన భక్తులు ఔరా అంటున్నారు.

ఇదికూడా చదవండి…

పేద విద్యార్థుల సేవలో..!