సిలిండర్ ప్రమాద బాధితులను ఆదుకోవాలి
– గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి
– వసతి గృహాల్లో వసతులు కల్పించాలి
– బీసీ సంఘం జా. కార్యవర్గ సభ్యులు కె. రాజ్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి : సిలిండర్ లీకై జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. యాలాల మండలంలోని బీసి వసతి గృహంలో సోమవారం ప్రమాద వశాత్తు గ్యాస్ సిలిండర్ లీకేజీకి గురికావడంతో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సిబ్బంది అనిత, బసమ్మ, ఫరానాభేగంలు గాయాలపాలయ్యారు. తాండూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను బుధవారం బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ బీసీ నేతలతో కలిసి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్ లీకేజీతో సిబ్బంది అగ్ని ప్రమాదానికి గురికావడం విచారకరమన్నారు. గాయపడిన బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. హైదరాబాద్ కు తరలించి కార్పోరేట్ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందేలా చూడాలన్నారు. మరోవైపు వసతి గృహాల్లో స రైన వసతులు లేక ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నారు. కావున వసతి గృహాల్లో సరైన వసతులు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, యాలాల మండల అధ్యక్షులు లక్ష్మణ్ చారి, నాయకులు సాయి, శివ, రాము ముదిరాజ్, వెంకట్ జుంటుపల్లి, రమేష్, నవీన్ తదితరులు ఉన్నారు.
ఇదికూడా చదవండి…

