14 మంది మట్కారాయూళ్లపై కేసు

క్రైం తాండూరు వికారాబాద్

14 మంది మట్కారాయూళ్లపై కేసు
– రూ.14,200ల స్వాధీనం
– టాస్క్ ఫోర్స్ దాడులతో వెలుగులోకి ఘటన
– వివరాలు వెల్లడించిన తాండూరు పోలీసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి : గుట్టుగా మట్కా ఆడుతున్న జూదరులపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పట్టుబడిన 14 మందిపై తాండూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పట్టణ ఎస్ఐ అబ్దుల్ రావుఫ్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తాండూరు పట్టణం సీతారాంపేటలోని మంగళవారం రాత్రి ఓ ఇంట్లో మట్కా ఆడుతున్నట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దాడులు నిర్వహించగా 14 మంది మట్కారాయుళ్ళు పట్టుబడ్డారు. వారిని అదుపులోకి తీసుకొని తాండూరు పోలీసులకు అప్పగించారు. దీంతో బుధవారం 14 మందిపై కేసు నమోదు చేయడంతో పాటు వారి వద్ద నుంచి రూ. 14,200లను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.