మార్కెట్ కమిటి ప్రమాణ స్వీకారానికి ముహుర్తం ఫిక్స్
– ఎల్లుండి విలియమూన్ గ్రౌండ్లో ఏర్పాట్లు
– హాజరు కానున్న మంత్రి హరీష్ రావు
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారంకు ముహుర్తం ఫిక్స్ అయ్యింది. ఎల్లుండి కొత్త పాలకవర్గంలో ప్రమాణ స్వీకారం చేయించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. తాండూరు మార్కెట్ కమిటి చైర్ పర్సన్ గా వీణా శ్రీనివాస్ చారీ, వైస్ చైర్మన్ గా చంద్రవంచ పటేల్ ఉమాశంకర్, డైరెక్టర్లుగా హరిహరగౌడ్, షేక్ ఖాశిం అలీ, మ్యాతరి ప్రకాశం, కుర్వ భీమప్ప, యు. గోపాల్ రెడ్డి, ఎండీ ముస్తఫా. గోవింద్ నాయక్, అప్పుల వెంకటప్పు, మంత్రి వెంకటయ్య, జట్టిగాళ్ల శ్రీనివాస్, భాను ప్రసాద్, ప్రశాంత్ గౌడ్లు నియామకం అయిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రేపు బుధవారం కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారంకు ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలోని విలియమూన్ గ్రౌండ్ లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అదేవిధంగా మంత్రులు సబితారెడ్డి, మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిలు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గద్దె శ్రీనివాస్ చారి, వైస్ చైర్మన్ పటేల్ ఉమాశంకర్ విజ్ఞప్తి చేశారు.
ఇదికూడా చదవండి…

