కేసీఆర్‌తోనే విద్యారంగా అభివృద్ధి

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

కేసీఆర్‌తోనే విద్యారంగా అభివృద్ధి
– విద్యతో పాటు అన్ని రంగాలకు ప్రాధాన్యం
– బీఆర్ఎస్ యాలాల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి
– బీఆర్ఎస్వీ వ్యాసరచన పోటీకి స్పందన, బహుతుల అదంజేత
యాలాల, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చొరవతో విద్యారంగం అభివృద్ధి సాధిస్తోందని బీఆర్ఎస్ యాలాల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి అన్నారు. ఈనెల 17న సీఎం కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం బీఆర్ఎస్వీ తాండూరు డివిజన్ కమిటి ఇంచార్జ్ పి.జిలానీ ఆధ్వర్యంలో తాండూరు పట్టణం హైదరాబాద్‌ రోడ్డు మార్గంలోని సాంఘీక సంక్షేమ బాలికల పాఠశాలలో విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి యాలాల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. ఇందులో భాగంగానే కేజీ టు పీజీ విద్యాసంస్థలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. విద్యతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వడంతో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. అదేవిధంగా యాలాల వైస్ ఎంపీపీ రమేష్‌ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు పేరు తీసుకో రావాలని అన్నారు. అనంతరం విద్యార్థి విభాగం ఇన్చార్జ్ జిలాని మాట్లాడుతూ దేశంలో ఎక్కలేని విధంగా 1000కి పైగా గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి కార్పో రేట్ స్థాయిలో విద్యను అందిస్తున్నారని అన్నారు. అనంతరం వ్యాసరచన పోటీలో ప్రతిభ కనబరిచిన విద్యార్‌థులతో పాటు ప్రతి తరగతిలో క్లాస్‌ ఫస్ట్ వచ్చిన విద్యార్థులకు కూడ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పురుషోత్తం రెడ్డి, తాండూరు మున్సిపల్ 8వ వార్డు కౌన్సిల్ వెంకన్న గౌడ్, బెన్నూర్ సర్పంచ్ సర్పంచ్ పటేల్ రెడ్డి, అరవింద్ రెడ్డి, బీఆర్ఎస్ యువ నాయకులు కృష్ణ, స్కూల్ ప్రిన్సిపల్ అరుణ, ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.