బీఆర్ఎస్ సెకండ్ లిస్టు రెడీ..!

జాతీయం తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి రాజకీయం వికారాబాద్ హైదరాబాద్

బీఆర్ఎస్ సెకండ్ లిస్టు రెడీ..!
– మిగిలిన నాలుగుస్థాల అభ్యర్థులు ఖరారు
– బరిలో ఎవరు నిలుస్తున్నారంటే..?
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ త్వరలో జరుగుతున్న అసెంబ్లీ పోరుకు బీఆర్ఎస్‌ పార్టీ దూకుడు మీద ఉంది. గతంలో పార్టీ అభ్యర్థులను మొదటి జాబితాలో ప్రకటించగా.. అప్పుడు అన్ని పార్టీలకంటే ముందే రెండో జాబితాలో పూర్తి స్థాయి అభ్యర్థులను ప్రకటించేందుకు సిద్దమైంది.

 

మొదటి జాబితాలో మొత్తం 115 స్థానాల్లో ఒకేసారి అభ్యర్థుల్ని ప్రకటించిన బీఆర్ఎస్ మిగిలిన నాలుగు స్థానాల్లో పోటీ చేసేవారి పేర్లను ఖరారు చేసింది. ఇప్పటికే వారికి సమాచారం అందించిన పార్టీ అధిష్ఠానం.. త్వరలోనే అధికారికంగా ప్రకటించనుంది. మల్కాజిగిరి అభ్యర్థిగా మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డి, జనగామలో పల్లా రాజేశ్వరరెడ్డి, నర్సాపూర్‌లో సునీతా లక్ష్మారెడ్డిని బరిలో దింపాలని భారాస నిర్ణయించినట్లు తెలుస్తోంది.

 

గతంలో ప్రకటించిన జాబితాలో ఉప్పల్‌, బోథ్‌, ఖానాపూర్‌, ఆసిఫాబాద్‌, వైరా, వేములవాడ సిట్టింగ్‌ అభ్యర్థులను మార్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కామారెడ్డి, గజ్వేల్‌ నుంచి బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే. తాజాగా రెండో జాబితాను కూడా సిద్దం చేసి బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలపై దూకుడును కొనసాగిస్తోంది.

 

ఇది కూడా చదవండి…

14 మంది మట్కారాయూళ్లపై కేసు