ఎన్నికల తరువాత చూసుకుందాం..!
– తాండూరు అభివృద్ధిపై చర్చకు సిద్దం
– మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ జెండా
– మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల తరువాత తాండూరు అభివృద్ధిపై తేల్చుకుందామని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేసిన సవాల్ పై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

శుక్రవారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కూడా పార్టీ మారిన నేతనే అని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండగా డీసీసీబీ జిల్లా అధ్యక్ష పదవిని పొందారని, ఇందుకోసం తామూ కూడా కృషి చేశామని గుర్తుచేశారు. ఆ తరువాత అధికార దాహంలో బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరానని అన్నారు.

అదేవిధంగా తాండూరు అభివృద్ధి విషయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో చర్చలకు సిద్ధంగా ఉన్నానని అన్నారు. మున్సిపల్ ఎన్నికల తరువాత పట్టణంలోని ఏ వార్డులో అనేది టైం, పేస్ చెబుతానని స్పష్టం చేశారు. ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 36 వార్డులకు గాను 30 స్థానాల్లో విజయం సాధించడం ఖాయమన్నారు. మున్సిపల్ కార్యాలయంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డి, చైర్మన్ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, నాయకులు శ్రీనివాస్ చారి, మాజీ వైస్ చైర్మన్ ఆసిఫ్, బీఆర్ఎస్ పట్టణ ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సలీం తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

