వీఆర్ఏల‌ ఆగ్రహం..!

తాండూరు రాజకీయం వికారాబాద్

వీఆర్ఏల‌ ఆగ్రహం..!
– తహసీల్దార్ ఆఫీసు దిగ్బంధం
– కార్యాలయం ముందు నిరసన
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి: తాండూరు మండల వీఆర్ఏలు ఆగ్రహించారు. సమ్మెలో పాల్గొన్న వీఆర్ఎలు అంతా తాండూరు తహసీల్దార్ కార్యాలయాన్ని దిగ్బంధించారు. డిమాండ్ల సాధన కోసం 78 రోజులుగా మండల వీఆర్ఏలు సమ్మె చేపడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోనువారం కూడ తాండూరు మండల తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు సమ్మెకు దిగారు. అయితే కార్యాలయంలోకి అధికారులు వెళ్లకుండా ప్రధాన ద్వారాన్ని మూసి వేశారు. విధులకు వచ్చిన అధికారులను కార్యాలయం బయటే కుర్చీలో కూర్చొబెట్టి వారి ముందు వీఆర్ఏలు త‌మ‌ నిరసన వ్యక్తం చేశారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, కేసీఆర్ ప్రకటించిన జీఓను అమలు చేయాలని, అర్హులైన వారందరికి ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. దాదాపు రెండు గంటల పాటు వీఆర్ఏలు కార్యాలయం ముందు బైటాయించి నిరసన చేపట్టారు. అప్ప‌టి వ‌ర‌కు విధుల‌కు వ‌చ్చిన అధికారులు కార్యాల‌యం బ‌య‌టే ఉండిపోయారు. మ‌రోవైపు వీఆర్ఏల సంఘం రాష్ట్ర కమిటి పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు మండల అధ్యక్షులు చంద్రప్ప, గౌరవాధ్యక్షులు అంజిలప్ప, ఉపాధ్యక్షులు ముణ్యప్ప, గోవింద్, యాదగిరి, నవీన, దశరథ్, నర్సమ్మ, బాలమణి, స్వప్న తదితరులు పాల్గొన్నారు.