సేవా ప్రావిణ్యుడు రొంపల్లి సంతోష్ కుమార్

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

సేవా ప్రావిణ్యుడు రొంపల్లి సంతోష్ కుమార్
– గాంధీ జయంతిన డాక్టరేట్, శాంతి సేవా రత్న అవార్డు
– ప్రధానం చేసిన మనం ఫౌండేషన్
తాండూరు, దర్శిని ప్రతినిధి : సామాజిక సేవలో ప్రావీణ్యుడుగా తాండూరుకు చెందిన రొంపల్లి సంతోష్ కుమార్ కితాబు అందుకున్నారు. ఆయనకు ఉత్తమ డాక్టరేట్ సర్టిఫికెట్ తో పాటు మహాత్మ గాంధీ శాంతి సేవా రత్న అవార్డును అందుకున్నారు. సోమవారం గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని సిటీ కల్చరల్ సెంటర్ లో అంతర్జాతీయ గుర్తింపు పొందిన మనం పౌండేషన్ ఆధ్వర్యంలో ప్రవేటు, ప్రభుత్వ రంగాలలో వివిధ సేవా కార్యక్రమాల్లో ప్రావీణ్యం పొందిన వారికి ఉత్తమ సేవా పురస్కరాలను అందజేశారు.

ఇందులో తాండూరుకు చెందిన యువనాయకులు రొంపల్లి సంతోష్ కుమార్ కు అవకాశం దక్కింది. లయన్స్ క్లబ్, ఆర్యవైశ్య యువజన సంఘం వైశ్య ఫెడరేషన్ ద్వారా వివిధ సేవ కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు వేసవిలో ఉచిత రాగి అంబలి, మజ్జిగ పంపిణీ సేవలను గుర్తించిన పౌండేషన్ సభ్యులు రొంపల్లి సంతోష్ కుమార్ కు ఉత్తమ డాక్టరేట్ సర్టిఫికెట్ తో పాటు మహాత్మ గాంధీ శాంతి సేవా రత్న అవార్డును అందజేశారు.

ఈ సందర్భంగా రొంపల్లి సంతోష్ కుమార్. మాట్లాడుతూ సమాజంలో పేద వారికి తనవంతు సహాకారం అందించాలనే ఉద్దేశంలో సేవా కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. తన ఆత్మ సంతృప్తి కోసం సేవను కొనసాగిస్తానని అన్నారు. మరోవైపు సంతోష్ కుమార్ అవార్డులు పొందిన సందర్భంగా పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.

ఇది కూడా చదవండి…

14 మంది మట్కారాయూళ్లపై కేసు