గెలుపు హస్తగతమే..!
– తాండూరును కైవసం చేసుకోవడం పక్కా
– ఎన్నికల్లో రోహిత్ రెడ్డి గుణపాఠం తప్పదు
– పార్టీలోకి మనోహర్ రెడ్డిని స్వాగతిస్తున్నాం
– మీడియా ముందు మాజీ మంత్రి గడ్డం ప్రసాద్
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లాలో గెలుపు హస్తగతం అవడం ఖాయమని, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సీఎం కావడం పక్కా అని కాంగ్రెస్ సీనీయర్ నాయకులు, మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశానికి మాజీ మంత్రి గడ్డం ప్రసాద్, జిల్లా పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీలో చేరిన డీసీసీబీ జిల్లా చైర్మన్ మనోహర్ రెడ్డితో హాజరయ్యారు.
ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. వరంగల్ రైతు డిక్లరేషన్, హైదరాబాద్ యువ డిక్లరేషన్, చేవెళ్ల ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ తో పాటు ఆరు గ్యారెంటీ స్కీమ్ లను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేస్తామన్నారు. అంతేకాకుండా మరిన్ని సంక్షేమ పథకాలను మేనిఫెస్టోలో పొందుపరచనున్నట్లు చెప్పారు. ఎన్నికల్లో గెలుపు తరువాత రేవంత్ రెడ్డి సీఎం కావడం తథ్యమన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాండూరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపును ఎవ్వరు ఆపలేరన్నారు. కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి బీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి గుణపాఠం తప్పదన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన డీసీసీబీ చైర్మన్ మనోహర్ రెడ్డిని స్వాగతిస్తున్నామన్నారు.
డీసీసీబీ జిల్లా చైర్మన్ మనోహర్ రెడ్డి మాట్లాడుతూ నాయకులు, అభిమానుల కోరిక మేరకు తాను బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరడం జరిగిందన్నారు. బీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్నందుకు సరైన న్యాయం జరగలేదన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు డా.సంపత్ కుమార్, పట్టణ అధ్యక్షులు హబీబ్ లాల, మాజీ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్, భీమయ్య, బసవరాజ్, మల్లికార్జున్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అలీమ్, లింగదలి రవికుమార్, మండలాల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.
ఇది కూడ చదవండి..

