మరుపురాని సేవలందిస్తా..!
– తాండూరు జెడ్పీటీసీ గౌడి మంజుల
– ఉత్తమ ఉగాది పురస్కారం అందుకున్న జెడ్పీటీసీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: సమాజంలో మరుపురాని సేవలందించేందుకు బాధ్యతగా కృషి చేస్తానని తాండూరు జెడ్పీటీసీ గౌడి మంజుల వెంటేశం అన్నారు. కరోనా సమయంలో పేదలకు 15 వేల మాస్కులను ఉచితంగా పంపిణీ చేయడంతో పాటు వివిధ సేవా కార్యక్రమాలను మెచ్చి హైదరాబాద్‌లోని మంజునాథ ఫౌండేషన్ జెడ్పీటీసీ గౌడి మంజులను ఉగాది పురస్కార అవార్డుకు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జెడ్పీటీసీ గౌడి మంజుల బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య, బీసీ కమీషన్ చైర్మన్ కృష్ణమోహన్ రావు చేతుల మీదుగా ఉగాది పురస్కార అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ గౌడి మంజుల మాట్లాడుతూ తన సేవలను మెచ్చి అందించిన ఉగాది పురస్కారం బాధ్యతను పెంచిందన్నారు. ఇకముందు సేవే లక్ష్యంగా మరుపురాని సేవలను అందిస్తానని పేర్కొన్నారు. మరోవైపు జెడ్పీటీసీ గౌడి మంజుల ఉగాది పురస్కారం అందుకోవడం పట్ల తాండూరు మండల ప్రజా ప్రతినిధులు ఆమెకు అభినందనలు తెలిపారు.

