మెడికల్‌ ఏటీఎం..!

ఆరోగ్యం జాతీయం టెక్నాలజీ తెలంగాణ వికారాబాద్ హైదరాబాద్

మెడికల్‌ ఏటీఎం..!
– చిటికెలో టెస్ట్.. వెంటనే రిపోర్టు
– జ్వరం నుంచి క్యాన్సర్‌ వరకు పరీక్షలు
– దేశంలోనే తొలిసారి ఆవిష్కరణ
– రోగులకు ఎలా పనిచేస్తుందంటే..?
దర్శిని డెస్క్‌ : మెడికల్‌ ఏటీఎంతో దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్ లో ఎనీ టైం క్లినిక్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు వివివ వ్యాపారాల కోసం విభిన్న రకాలుగా రూపొందించిన ఏటీఎంలను చూసుంటారు. కాని ఇది వాటన్నంటికి ఆపోసిట్. ఎవరైనా అనారోగ్యం బారిన పడితే.. పరీక్షించిన వైద్యులు ఆయా సంబంధిత పరీక్షలు చేసుకరావాలని సూచిస్తుంటారు.

డయాగ్నస్టిక్స్ దగ్గర గంటల తరబడి క్యూ లో నిల్చుని.. తీరా టెస్ట్ అయిపోయిందనుకుంటే టెస్ట్ రిపోర్ట్ కోసం రేపు రండి… సాయంత్రం వరకు వెయిట్ చేయండి అంటారు. ఇందంతా ప్రాసెస్ అవ్వడానికి ఎంత తక్కువ అనుకున్న కనీసం 24 నుంచి 48 గంటల సమయం పడుతుంది. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి డాక్టర్ ని కలవాలి. కానీ ఇప్పుడీ పని లేకుండా.. టైం వేస్ట్ అవ్వకుండా.. క్షణాల్లోనే మన ఆరోగ్య సమస్యను తెలుసుకుని డాక్టర్ ని సంప్రదించి. చిటికెలో టెస్ట్స్ చేపించుకుని రిపోర్ట్ కూడా తీసుకోవచ్చు. అదే మెడికల్ ఏటీఎం వ్యవస్థ.

ఈ వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చారు. అదీ మన హైదరాబాద్‌లోనే. ప్రణామ్ హాస్పిటల్స్ కలిసి జెమ్ ఓపెన్ క్కుబ్ టెక్నాలజీస్ సంస్థ ఎనీ టైం క్లినిక్ ని తయారు చేసింది. చందానగర్ లోని ప్రణామ్ హాస్పిటల్ లో ప్రారంభించారు.

ఏయే పరీక్షలు చేస్తారంటే…?
మొబైల్‌ నెంబర్‌, థంబ్‌ స్కానర్‌, హెల్త్‌కార్డు, ఆధార్‌ కార్డు ద్వారా తొలుత రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. మెషిన్ ఇచ్చే వచ్చే సూచనల ఆధారంగా టెస్ట్స్ చేసుకోవాలి. ఈ మెషిన్ ద్వారా డెబ్భై ఐదు రకాల పరీక్షలు చేసేలా ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, మెషీన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీని ఉపయోగించి మెషిన్ ను మెడికల్ డయాగ్నస్టిక్స్ రూమ్ గా తయారు చేశారు.

బేసిక్‌ హెల్త్‌ చెకప్‌, కంటి పరీక్షలు, ఈఎన్‌టీ, చర్మం, నెయిల్‌ ఇమేజ్‌ కాప్చరింగ్‌, హెచ్‌ఐవీ, లంగ్‌ క్యాన్సర్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్‌, ట్యూమర్‌, సర్వైకల్‌ క్యాన్సర్‌, హార్ట్‌ డిసీజ్‌, కొవిడ్‌, ఆల్కహాల్, ఐక్యూ టెస్టులను దీని ద్వారా చేసుకోవచ్చు. బ్లడ్ టెస్ట్, యూరిన్ టెస్ట్ల తో పాటు ప్రెగ్నెన్సీ టెస్ట్, డెంగీ, మలేరియా, టైఫాయిడ్‌ వంటి ర్యాపిడ్ టెస్ట్స్ కూడా చేసుకోవచ్చు. టెస్ట్ రిపోర్ట్స్ తో పాటు వెంటనే వైద్యులతో వీడియో కాలింగ్‌, అక్కడికక్కడే ప్రిస్కిప్షన్‌ ప్రింటవుట్‌ తీసుకోవచ్చు. ఒకే ఒక్క అటెండర్‌ సహాయంతో యంత్రం ఇచ్చే సూచనల ఆధారంగా రోగులే తమ పరీక్షలు చేసుకోవచ్చు.

మెషిన్ కు సెట్ చేసిన వెబ్ కెమెరా ద్వారా వీడియోకాల్‌లో ఉన్న వైద్యులు సమస్యను గుర్తించి ప్రిస్కిప్షన్‌ను అందిస్తారు. పరీక్షల రిపోర్టులు నేరుగా మొబైల్‌కు రావడంతోపాటు అక్కడే ప్రింట్‌ తీసుకోవచ్చు. దీంతోపాటు డిజిటల్‌ హెల్త్‌ రికార్డును పరిశీలించొచ్చు. దీని ద్వారా చేసుకునే టెస్ట్ లకు సాధారణంగా హాస్పిటల్ లో చేసుకునే టెస్టుల్లో తీసుకునే ఫీజులో ముప్పై శాతం మాత్రమే ఫీజ్ తీసుకోనున్నారు. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఈ మెషిన్ కు ఇతర దేశాల నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా విస్తరరణ
త్వరలోనే ఈ మెషిన్ ఎయిర్ పోర్ట్స్, రైల్వే స్టేషన్స్, మెట్రో స్టేషన్స్, షాపింగ్ మాల్స్ వంటి పబ్లిక్ ప్లేసెస్ లో అందుబాటులో ఉంచనున్నారు. సిటీలో అయితే మూల మూలన హాస్పిటల్ ఉంటుంది ఎమర్జెన్సీలో స్పెషలిస్ట్ డాక్టర్స్ కూడా అందుబాటులో ఉంటారు కానీ మారుమూల ప్రాంతాల్లో ఈ సౌకర్యం ఉండదు. అందుకోసమే వీటిని త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉంచనున్నారు.

ఇది కూడ చదవండి..

14 మంది మట్కారాయూళ్లపై కేసు