ఆదర్శ అభివృద్ధికి కృషి
– తాండూరు ప్రగతి కోసం కోట్లాది నిధులు
– బీఆర్ఎస్ పార్టీకి మళ్లీ అండగా నిలవాలి
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : అభివృద్ధిలో తాండూరును ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు మున్సిపల్ పరిధిలో వివిధ గ్రాంట్ల కింద మంజూరైన రూ.9కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మున్సిపల్ కార్యాలయంలో గ్రీనరీ పనులకు శంకుస్థాపన, అంగన్ వాడి, డ్వాక్రా భవనాల ప్రారంభోత్సవం, పాత కుంటలో కేసీఆర్ థీమ్ పార్క్ కు శంకుస్థాపన, 26వ వార్డులో ఎస్టీఎఫ్ నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు.
ఈ సందర్భంగా ఆయా సమావేశాల్లో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూరును అభివృద్ధిలో ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. కొట్లాది నిధులతో పార్టీలకతీతంగా పట్టణంలోని వార్డుల ప్రగతికి ప్రాధాన్యమివ్వడం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నమ్మొద్దని సూచించారు. మళ్లీ బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, మార్కెట్ కమిటి చైర్ పర్సన్ వీణ శ్రీనివాస్ చారి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, బీఆర్ఎస్ మహిళ అధ్యక్షురాలు సంగీత ఠాకూర్, ఫ్లోర్ లీడర్ శోభారాణి, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు. కౌన్సిలర్లు నీరజాబాల్ రెడ్డి, మంకాల రాఘవేందర్, వెంకన్నగౌడ్, సోమ శేఖర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…

