రూ. 2.50లక్షలు సీజ్..!

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

రూ. 2.50లక్షలు సీజ్..!
– తనిఖీలో పట్టుకున్న పోలీసులు
– వెల్లడించిన సీఐ రాజేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఎలాంటి ధ్రువ పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ. 2.50 లక్షలను తాండూరు. పోలీసులు సీజ్ చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కోడ్ లో భాగంగా ఎవరైనా 50 వేలకు మించి డబ్బులు తరలించకుండా పోలీసులుకట్టడి చర్యలు చేపడుతున్నారు.

ఈ మేరకు గురువారం తాండూరు పట్టణంలోని విలియం మూన్ వద్ద పట్టణ పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా బైక్ పై వస్తున్న వ్యక్తి వద్ద డబ్బులను గుర్తించారు. అతని వద్ద నుంచి రూ. 2.50 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. డబ్బులకు సంబంధించి ఎలాంటి ధ్రువపత్రం లేకపోవడంతో వాటిని సీజ్ చేశారు.

 

ఈ సందర్భంగా పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ పట్టుబడిన డబ్బులను స్క్రీనింగ్ కమిటీ ముందు అప్పగించడం జరుగుతుందన్నారు. ఇందుకు సంబంధించిన ధూపత్రాలను చూపిస్తే సీజ్ చేసిన డబ్బులను తిరిగి అప్పగిస్తామని తెలిపారు.