బీఆర్ఎస్ మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా పరిమళ
– నియమించిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– కృతజ్ఞతలు తెలిపిన మాజీ కౌన్సిలర్
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీఆర్ఎస్ పార్టీ తాండూరు పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాజీ కౌన్సిలర్ గడ్డలి పరిమళ నియామకం అయ్యారు. సోమవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆమెకు నియామక పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లి ప్రజలను వివరించాలన్నారు. మహిళ సాధికారత కోసం సీఎం కేసిఆర్ చేస్తున్న కృషిని మహిళలకు వి వరించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపులో మహిళలు కీలక పాత్ర పోషించేలా కృషి చేయాలన్నారు. అదేవిధంగా పార్టీలో తనకు వర్కింగ్ ప్రెసిడెంట్‌గా అవకాశం కల్పించడం పట్ల ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి పరిమళ కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ గెలుపుకోసం తనవంతు కృషి చేస్తానని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, మార్కెట్ కమిటి చైర్ పర్సన్ వీణ శ్రీనివాస్ చారి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య, మార్కెట్ కమిటి వైస్ చైర్మన్, ఉమాశంకర్, బీఆర్ఎస్ మహిళ కన్వినర్ శకుంతల, ఫ్లోర్ లీడర్ శోభారాణి, నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, బంటారం సుధాకర్, యాలాల మండల అధ్యక్షులు రవీందర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ శేఖర్ తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి…

