ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

తాండూరు రాజకీయం వికారాబాద్

ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
– సర్పంచు ఫిర్యాదుతో పూడ్చిన మృతదేహానికి పోస్టుమార్టం
– నివేధిక ఆధారంగా నిందితులను రిమాండు
– వివరాలు వెల్లడించిన పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను కడతేర్చింది ఓ భార్య. గ్రామ సర్పంచ్ ఫిర్యాదుతో పూడ్చిపెట్టిన మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి.. దాని ఆధారంగా హత్యగా తేలడంతో పోలీసులు నిందితులను రిమాండుకు తరలించారు. గురువారం ఈ కేసు వివరాలను తాండూరు పట్టణ సీఐ రాజేందర్ రెడ్డి వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తాండూరు మండలం ఖాంజాపూర్ గ్రామానికి చెందిన దాసరి వెంకటయ్య ఈ యేడాది మార్చి 16న అనుమానాస్పదంగా మరణించారు. గ్రామ సర్పంచు లలిత ఫిర్యాదుతో రెండు, మూడు రోజుల తరువాత పోలీసులు కేసు నమోదు చేశారు.

విచారణలో భాగంగా పూడ్చి పెట్టిన మృతదేహానికి వైద్య నిపుణులు పోస్టుమార్టం చేయించారు. ఈ పోస్టుమార్టంలో వెంకటయ్య గొంతు నులమడంతో మరణించినట్లు నిర్ధారణ అయ్యింది. అనుమానంతో భార్య సుజాతను విచారించగా ఆమె తన ప్రియుడు బసిరెడ్డి అలియాస్ రామచందర్ లు కలిసి హత్య చేసినట్లు నేరం అంగీకరించారు. ఈ మేరకు నింది తులను అదుపులోకి తీసుకుని గురువారం రిమాండుకు తరలించినట్లు సీఐ రాజేందర్ రెడ్డి వివరించారు.

ఇది కూడా చదవండి…

గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ కన్నుమూత