అదే ఊపు.. అదే జోరు..!

తాండూరు రాజకీయం వికారాబాద్

అదే ఊపు.. అదే జోరు..!
– తాండూరులో రెండో రోజు పైలెట్ పాదయాత్ర
– మల్‌రెడ్డిపల్లి నుంచి ప్రారంభించిన రోహిత్ రెడ్డి
– పబ్లిక్ నుంచి విశేష స్పందన
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పట్టణంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాదయాత్ర శనివారం కొనసాగింది. మొదటి కనిపించిన ఊపుతో.. జోరుతో ఉత్సహాంగా కొనసాగింది. రెండో రోజు పట్టణంలోని 24, 25వ వార్డుతో పాటు 1వ వార్డు నుంచి 7వ వార్డు, 9వ వార్డు నుంచి 12వ వార్డు, 28వ వార్డులలో కొనసాగుతందని షెడ్యూల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 24వ వార్డు మల్ రెడ్డి పల్లి ఆంజనేయ స్వామి. శాంతప్ప కాలనీలోని పాండురంగ దేవాలయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పూజలు నిర్వహించి పాదయాత్రను ప్రారంభించారు. పాదయాత్రలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఉత్సహాంగా పాల్గొన్నారు. గులాబీ పార్టీ పాటలతో వార్డుల్లోని పురవీదుల్లో హోరెత్తించారు.

పాదయాత్రలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వార్డు ప్రజలకు, ముసలవ్వలను ఆప్యాయంగా పలకరిస్తూ కారు గుర్తుకే ఓటేయాలంటూ ఆకర్షించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్.. రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు. మార్కెట్ కమిటి చైర్ పర్సన్ వీణ శ్రీనివాస్ చారి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ (నయూం), మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ పరిమళ, మహిళ అధ్యక్షురాలు సంగీత ఠాకూర్, మాజీ అధ్యక్షురాలు అనురాధ, బీఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, ఫ్లోర్ లీడర్ శోభారాణి, మాజీ కౌన్సిరల్ జుబేర్ లాల, కౌన్సిలర్లు, పట్టణ ప్రధాన కార్యదర్శి సంతోష్ గౌడ్, యువనాయకులు, నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

గుండెపోటుతో ఆర్టీసీ కండక్టర్ కన్నుమూత