తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
తాండూరు: షాక్ సర్క్యూట్ కారణంగా ఇల్లు దగ్ధమైన బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ సప్న పరిమళ్ అన్నారు. శనివారం సాయంత్రం తాండూరు మున్సిపల్ పరిధి ఇందిరా నగర్ లోని మహమ్మద్ గౌస్ అనే కూరగాయల వ్యాపారి ఇల్లు షాక్ సర్క్యూట్ తో దగ్ధమైంది.


వార్డు కౌన్సిలర్ బాతుల మమత ద్వారా విషయం తెలుసుకున్న చైర్పర్సన్ స్వప్న పరిమళ్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధిత యజమాని గౌస్ తో ప్రమాద విషయంపై ఆరా తీసి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఇల్లు దగ్ధమైన విషయాన్ని తాండూరు తహసీల్దార్ చిన్నప్పల నాయుడుకు తెలియజేసి బాధిత కుటుంబానికి ప్రభుత్వం సహాకారంతో పరిహారం అందించి ఆదుకునేలా చూడాలని కోరారు.

