కొత్లాపూర్‌ ఎల్లమ్మ దేవాలయం ట్రస్టుకు గ్రీన్‌ సిగ్నల్‌

తాండూరు రాజకీయం వికారాబాద్

కొత్లాపూర్‌ ఎల్లమ్మ దేవాలయం ట్రస్టుకు గ్రీన్‌ సిగ్నల్‌
– దేవాలయ పాలకవర్గ వర్గం ఏర్పాటుకు నోటిఫికేషన్
– పాలకవర్గ వర్గం స్థానాలకు దరఖాస్తుల ఆహ్వానం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం కొత్లాపూర్‌ గ్రామంలో వెలసిన రేణుకా ఎల్లమ్మ దేవాలయ ట్రస్టు బోర్డు నియామకంకు గ్రీన్‌సిగ్నల్ వచ్చింది. ఈ మేరకు దేవాదాయశాఖ హైదరాబాద్‌ కమీషనర్‌ ఉత్తర్వులు జారీ చేసింది.

దేవాలయంలో వంశపారంపర్యత లేని సభ్యులను ట్రస్టీలుగా ఎన్నుకోవడం ఆనవాయితీ. ప్రస్తుతం ఉన్న దేవాదాయ శాఖ ట్రస్టు సభ్యుల పదవి కాలం ముగియడంతో కొత్త పాలకవర్గం ఏర్పాటు కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. కొత్లాపూర్ దేవాలయ పాలకవర్గ సభ్యుల పదవుల కోసం దేవాదాయ శాఖ నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఆసక్తిగల వారు దేవాదాయ శాఖ కార్యాలయంలో దరఖాస్తులను సమర్పించాలని అధికారులు సూచించారు.

నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి 20 రోజుల గడువులోపు దరఖాస్తులకు అవకాశం ఉంటుంది. కొత్లాపూర్ దేవాలయ ట్రస్టు నోటిఫికేషన్ ఈనెల 2న విడుదల కాగా రేపటితో ఇచ్చిన గడువు ముగిసిపోతోంది. అయితే కొత్లాపూర్ రేణుకా ఎల్లమ్మ దేవాలయ అధికారులకు మాత్రం నోటిఫికేషన్ రెండు రోజుల క్రితమే అధికారులకు చేరింది. గడువును పొడగించే అవకాశాలు ఉన్నట్లు అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

కౌన్సిలర్ పై దాడి ఘటనలో ట్విస్ట్..!